Spa massage centers
-
Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
డాక్టరై హాస్పిటల్ పెట్టాలనుకుంది.. వ్యభిచారం కూపంలో అడ్డంగా దొరికిన శృతి
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్మెంట్లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్–హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్ ఉల్ హక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. యువతులను రెస్క్యూహోంకు తరలించారు. 18 మంది విటులను కోర్టులో హాజరుపరిచారు. డాక్టర్ కావాలనుకుని.. దారి మళ్లిన యువతి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి శృతి చదువుల్లో రాణించింది. డాక్టర్ కావాలనుకొని ఉక్రెయిన్‌లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో ఏడాది ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలం వచ్చేసింది. అనంతరం అమీర్‌పేట్‌లోని ఓ శిక్షణ కేంద్రంలో ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ కూడా తీసుకుంది. అదే సమయంలో బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గానూ పని చేసింది. ఆ సమయంలోనే అయిదు నక్షత్రాల హోటల్ తళుకుబెళుకులను కళ్లారా చూసింది. స్టార్ హోటల్ లైఫ్‌కు పూర్తిగా అలవాటు పడింది. డాక్టర్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా కలలు కని అవి సాకారం కాకపోవడంతో.. తేలికగా డబ్బు సంపాదించే మరో మార్గంలో వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గతేడాది పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించింది. కాగా.. కొద్ది రోజుల్లోనే పంజగుట్ట పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. స్పా సెంటర్ నిర్వహణలో మెలకువలు తెలుసుకున్న సదరు యువతి జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ అదే దారి పట్టింది. ఈసారి బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్ తెరిచింది. కొద్ది రోజుల్లోనే ఆమె మసాజ్ సెంటర్ వ్యాపారం వృద్ధి చెందింది. పోలీసులు మరోసారి స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించారు. రెండోసారి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడి తాజాగా సోమవారం జైలుకు వెళ్లింది. -
స్పా ముసుగులో వ్యభిచారం
విజయవాడ స్పోర్ట్స్: నగరంలోని కొన్ని స్పా, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని శనివారం వెల్లడించారు. విజయవాడలో 200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు. కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆయా సెంటర్లపై వారం రోజులుగా నిఘా పెట్టామన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో శుక్రవారం రాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్నెస్ ఫిట్నెస్ సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారితోపాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. -
పోలీసుల నిర్వాకం.. స్పాసెంటర్ యువతులను బయటకు లాక్కొచ్చి..
చంఢీఘడ్: హర్యానాలోని రేవారిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు.. ఇద్దరు యువతుల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత గురువారం (నవంబరు25).. కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర, అతని మిత్రుడు ధర్మేంద్ర స్థానికంగా ఉన్న స్పా మసాజ్ సెంటర్‌పై దాడిచేశారు. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వారి వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో వారిని ఒక హోటల్‌కు తరలించారు. ముగ్గురు పోలీసులు కలిసి యువతులపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్పాసెంటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బళ్లారికి పాకిన స్పా మసాజ్ సెంటర్లు
సాక్షి, బళ్లారి : గతంలో స్పా మసాజ్ సెంటర్లు థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో ఉండేవి. తర్వాత మనదేశంలో ముంబయ్, బెంగళూరు, చెన్నై తదితర మహానగరాల్లో వెలిశాయి. ఇప్పుడు ఆ స్పా మసాజ్ సెంటర్లు బళ్లారి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్పా మసాజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులే చెబుతున్నారు. అప్పుడప్పుడు వనమూలికల తైలంతో మసాజ్ చేయించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. స్పా మసాజ్ అంటే ఆడవాళ్లు మగవారికి మసాజ్ చేయడమే. ఇందుకోసం ప్రత్యేక రేట్లు ఫిక్స్ చేశారు. గంట, అరగంటకో రేటు ఫిక్స్ చేసి ఆమేరకు మసాజ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్ చేస్తుండడంతో బళ్లారిలో సర్వత్రా చర్చనీయాంశమైంది. బళ్లారితోపాటు ఈ సెంటర్లు హంపి పరిసరాల్లోని రిసార్ట్లు, హెరిటేజ్లతో పాటు హొస్పేటలోని పెద్ద పెద్ద హోటళ్లలో కూడా వెలిశాయి. బాగా పేరున్న స్టార్ హోటల్, లాడ్జిలలో మసాజ్ సెంటర్లు ఉన్నాయి. మసాజ్ అరోగ్యానికి మంచిదే అయినా, ఆడవాళ్లు మగవాళ్లకు మసాజ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పా మసాజ్ సెంటర్లకు ఎలాంటి అనుమతి లేకున్నా నగరంలోని యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.