మసాజ్‌ ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు | Prostitution Scandal in Massage Center Krishna | Sakshi
Sakshi News home page

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు

Published Mon, Jan 14 2019 12:28 PM | Last Updated on Mon, Jan 14 2019 12:28 PM

Prostitution Scandal in Massage Center Krishna - Sakshi

కృష్ణాజిల్లా, గుణదల (విజయవాడ తూర్పు) : మసాజ్‌ సెంటర్‌ల ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతులను, విటులను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బందరు రోడ్డు పీవీపీ మాల్‌లోని ఓ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో మసాజ్‌ చేస్తున్న థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకుని మాచవరం స్టేషన్‌కు తరలించారు. లాల్‌ పంతులంగి (మిజోరాం), అకుసరథా (థాయ్‌లాండ్‌), సుత్వింగ్‌ నుజారి (థాయ్‌లాండ్‌), ఎల్‌మోన్టీపికున్‌కౌ (థాయ్‌లాండ్‌) యువతులతో పాటు బలేశ్వర పటేల్‌ (బీహార్‌), జి చక్రధర్‌ (విజయవాడ), ఎ శివప్రసాద్‌ (తుళ్లూరు) అనే విటులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.98 వేల నగదు, 9 సెల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకుడు అరుణ్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement