మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం | Prostitution Scandal In Masaj Centre | Sakshi
Sakshi News home page

మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

Published Wed, Feb 20 2019 9:53 AM | Last Updated on Wed, Feb 20 2019 9:53 AM

Prostitution Scandal In Masaj Centre - Sakshi

ఇద్దరు విటులు, ముగ్గురు యువతుల అరెస్ట్‌

హిమాయత్‌నగర్‌: మసాజ్‌ సెంటర్‌ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి, నిర్వాహకుడు పజ్జూరి వెంకటేష్‌ పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విఠల్‌వాడీ ఎక్స్‌రోడ్డులో రాజశేకర్‌ అనే వ్యక్తి ‘ థ్యాంక్యూ రిఫ్రెష్‌బ్యూటీ అండ్‌ హెల్త్‌ కేర్‌’ పేరుతో బ్యూటీపార్లర్, మసాజ్‌ నిర్వహిస్తున్నాడు. ఇందులో క్రాస్‌ మసాజ్‌తో పాటు, వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా  ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపు లోకి తీసుకున్నారు. యువతులను రెస్యూ్య హోంకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement