
అల్వాల్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రంనిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భిక్షపతి అనే వ్యక్తి మల్లారెడ్డి నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి నిర్వాహకుడు భిక్షపతితో పాటు విటులు నల్లా క్రాంతికుమార్, సామల బుచ్చిరెడ్డిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.