
అమీర్‌పేట: ప్రముఖ హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి నలుగురు విదేశీ యువతులతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న మంగళవారం వివరాలు వెళ్లడించారు. అమీర్‌పేట, ఆదిత్య పార్క్ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, హోటల్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. పంజగుట్టలోని పోలో లాడ్జిపై దాడి చేసి ఉజకిస్తాన్‌కు చెందిన నలుగురు మహిళలతో పాటు బెంగాల్‌కు చెందిన యువతి, నలుగురు విటులను అరెస్టు చేశారు. పోలీసుల రాకపై సమాచారం అందడంతో నిర్వాహకులు పరారైనట్లు తెలిపారు. రాహుల్, సూర్య అనే వ్యక్తులు ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఏపీసీ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఆర్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ అజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెళ్లడిస్తున్న ఏసీపీ తిరుపతన్న
Comments
Please login to add a commentAdd a comment