
పహాడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై బాలాపూర్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రకుంట ప్రాంతంలో రాజు, అసద్‌ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ గదిని అద్దెకు తీసుకొని గత కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ ప్రాంతానికి మాధవ్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళ (30)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment