మైనర్‌ను వ్యభిచారంలోకి.. | Prostitution Gang Held in Prakasam | Sakshi
Sakshi News home page

మైనర్‌ను వ్యభిచారంలోకి దించిన ముఠా అరెస్టు

Published Wed, Jul 22 2020 12:19 PM | Last Updated on Wed, Jul 22 2020 12:19 PM

Prostitution Gang Held in Prakasam - Sakshi

ప్రకాశం ,కందుకూరు:కందుకూరు ప్రాంతంలో రహస్యంగా వ్యభించారం నిర్వహిస్తూ బాలికతో బలవంతంగా వ్యభించారం చేయిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ ధనుంజయులు మంగళవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కందుకూరు పోలీసులతో కలిసి విచారణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తన అన్న, వదినల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె వదిన జ్యోతి బాలికను సింగరాయకొండకు చెందిన కె. మాధవి అనే వ్యవభిచార నిర్వాహకురాలికి రూ.27 వేలకు అమ్మేసింది.

మాధవి కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బాలికతో కూడా బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఎలాగోలా బాలిక 100 కాల్‌ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు రెండు రోజుల క్రితం ఆ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. స్థానిక ఏరియా వైద్యశాలలో బాధితురాలికి చికిత్స అందించారు. అనంతరం ఈ కేసును దిశ చట్టం కింద డీఎస్పీ ధనుంజయులుకు అప్పగించారు. ఆయన మంగళవారం విచారణ చేపట్టారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ వ్యభిచార కూపంలో ఎవరెవరు ఉన్నారు? బాలికతో వ్యభిచారం చేయించిన మాధవితో పాటు, ఆమె వదిన జ్యోతిని మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార ముఠాతో ఇంకా ఎంతమందికి సంబంధం ఉంది, ఇంకెవరెరు ఈ ముఠాలో ఉన్నారనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement