సినీ అవకాశాల పేరుతో వ్యభిచారం | Casting Coauch Complaint In Facebook In Tamil Nadu | Sakshi
Sakshi News home page

సినీ అవకాశాల పేరుతో వ్యభిచారం

Published Thu, Dec 6 2018 10:45 AM | Last Updated on Thu, Dec 6 2018 10:45 AM

Casting Coauch Complaint In Facebook In Tamil Nadu - Sakshi

తమిళనాడు, పెరంబూరు: చెన్నైలో తాజాగా మరో కాస్టింగ్‌కౌచ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలతో కామవాంఛ తీర్చుకోవడం, వ్యభిచారంలోకి దింపడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యకి గుట్టును ఒక మహిళ బయట పెట్టింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ నటి శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలువురు ప్రముఖ కథానాయికలు తామూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నామని బహిరంగ ఇంటర్వ్యూల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన విషయం తెలి సిందే. తాజాగా మీటూ అంటూ లైంగిక వేధిం పుల ఫిర్యాదులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైకి చెందిన ఒక యువతి మోహన్‌ అనే సినీ కాస్టింగ్‌ డైరెక్టర్‌ అవకాశాల ఆశ చూపి అనేక మంది మహిళలను వ్యభిచారంలో దింపుతున్నాడని ఆరోపించింది. తానూ అమ్మాయిలతో రాసలీలలు నడుపుతున్నాడని, ఈ విషయాన్ని బయట పెడితే తనతో గడిపిన రాసలీలల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. మోహన్‌ అవకాశాల పేరుతో అమ్మాయిలను వా డుకుంటున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని తన ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. అయితే ప్రస్తుతం తన పేరును రక్షణ దృష్ట్యా బయటకు చెప్పలేనని, తన వద్ద ఉన్న మోహన్‌ రాసక్రీడల దృశ్యాలను ఇప్పటికే తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశానని పేర్కొంది. ఆమె పోస్ట్‌ చేసిన మోహన్‌ రాసలీలల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement