ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర మండల పరిధిలోని కార్ఖానాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల సహా నలుగురిని అరెస్టు చేశామని, ఒడిశాకు చెందిన ఓ యువతిని రెస్క్యూ చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన లక్ష్మి వ్యభిచార దందా నిర్వహిస్తోంది. ఈమెతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజమండ్రికి చెందిన విజయకుమారి హైదరాబాద్‌కు మకాం మార్చి, కార్ఖానాలోని రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన శంకర్‌తో కలిసి దందా ప్రారంభించింది.
దళారుల సాయంతో వారానికి రూ.10 వేలు చెల్లిస్తూ ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది. వీరు ఇటీవలే ఒడిస్సా నుంచి ఓ యువతిని తీసుకువచ్చారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఫ్లాట్‌పై దాడి చేశారు. నిర్వాహకులు విజయకుమారి, శంకర్‌లతో పాటు, విటులు విజయ్, దీపక్‌లను అరెస్టు చేసి యువతిని రెస్క్యూ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కార్ఖానా పోలీసులకు అప్పగించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో..
నాచారం: రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై నాచారం పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన మల్లిఖార్జున్ హబ్సిగూడలోని హరిప్రియా కాంప్లెక్స్‌లో శ్రీ సుధా రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. కాసోజు సుధా అలియాస్ ఫాతిమాతో కలిసి గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. వీరు ముంబాయి నుండి అమ్మాయిలను తీసుకువచ్చినట్లు సమాచారం అందడంతో నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులు మల్లిఖార్జున్, ఫాతిమాలతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ విఠల్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment