బెంగళూరు: మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్‌లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ధార్వాడ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.
తాను సెలూన్‌లో ఉన్నప్పుడు మనోజ్ వచ్చి బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు జరిగిన విషయాన్ని తన ప్రియుడికి వెంటనే తెలియజేసింది. దీంతో అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సెలూన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతను చితకబాదాడు.
మనోజ్ కర్జాగిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అతను తమ హయాంలో ఓ మంత్రికి సహాయకుడిగా పనిచేశాడని కాంగ్రెస్ తెలిపింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోజ్ నార్త్‌వెస్ట్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment