
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా చేతికి స్వల్ప గాయమైంది.. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని లక్ష గులాబీలను ఫ్యాన్స్ పంపారు.

తాజాగా ఓ షూటింగ్‌లో ఊర్వశి చేతికి స్వల్ప గాయమైంది. చేతి వేళ్లకు రక్తం కారుతున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులను కోరింది.

దీంతో ఆమె డైహార్డ్ ఫ్యాన్స్ ఏకంగా లక్ష గులాబీలు పంపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ.

ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.






