కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ (TMC MP Sagarika Ghose) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలను సత్యం గెలిచే తరుణంగా ఆమె అభివర్ణించారు.
"ఈ ఎన్నికలు ఎందుకు అవసరం? ఈ ఎన్నికలు మనకు సత్యాన్ని గెలిపించే క్షణాలు. ఒక పార్టీకి, ఒక నాయకుడికి, ఒకే భాషకు, ఒకే మతానికి, ఒకే దుస్తులకు కట్టుబడి ఉందామా? లేదా మన సమాఖ్య, భిన్న విశ్వాసాలు, బహుళ సాంస్కృతిక వైవిధ్యమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా?" అని ఆమె ప్రజలను ప్రశ్నించారు. "మన ప్రాథమిక స్వేచ్ఛకు ముప్పు ఉన్న కాలంలోనే జీవించాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి.. తెలివిగా ఓటు వేయండి" అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
కాగా, దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Why are the #GeneralElections2024 important ? This is a moment of truth for us. Do we want to live under a one-leader-one-party-one-religion-one-language rule? Or do we want to preserve our multi faith multi cultural multi party democracy? Remember that and vote well & vote… pic.twitter.com/FPsJhmGV48
— Sagarika Ghose (@sagarikaghose) March 17, 2024
Comments
Please login to add a commentAdd a comment