ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున పరిహారం ప్రకటించారు. దీనికితోడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ టీఎంసీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజూమ్‌దార్ మాట్లాడుతూ బెంగాల్‌కు చెందిన ఒక మంత్రి మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు పంపిణీ చేశారని, అయితే అవన్నీ రూ. 2000 నోట్లు అని ఆరోపించారు.
ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశారు. దానిలో ఇద్దరు మహిళలు చాపమీద కూర్చుని ఉండగా, ఒక మహిళ కుర్చీలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ ముగ్గురు మహిళలు రూ. 2000 నోట్లతో కూడిన బండిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సదరు బీజేపీ నేత... బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు టీఎంసీ ఈ పని చేయడం లేదు కదా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఆదేశాలకు అనుగుణంగా తృణమూల్ పార్టీ తరపున రూ. 2 లక్షల సాయం అందిస్తున్నారు. ఇది మంచి విషయమే. కానీ ఈ రూ. 2000 నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 2000 నోట్ల చలామణి తక్కువగా ఉన్నదని, బ్యాంకులలో వీటిని మార్చుకునే ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు రూ. 2000 నోట్లు ఇవ్వడం వలన వారికి ఇబ్బందిగా మారుతుందన్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన టీఎంసీ నేత కుణాల్ ఘోష్ మాట్లాడుతూ బీజేపీ నేత సుకాంత్ మజూమ్‌దార్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రూ. 2000 నోటు మారకంలో లేనిదా? అని ప్రశ్నస్తూ, వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదేమీ అక్రమం కాదు.
ఎవరైనా రూ. 2000 నోటు ఇస్తే అదేమీ నల్ల ధనం అయిపోదని అన్నారు. రైలు ప్రమాద బాధితులకు రూ. 2000 నోటు పంపిణీ చేసిన ఉదంతం పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలోని బసంతీలో చోటుచేసుకుంది. టీఏంసీ నేత బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు
মমতা বন্দ্যোপাধ্যায়ের নির্দেশে তৃণমূল দলের পক্ষ থেকে নিহতদের পরিবারকে 2 লক্ষ টাকার আর্থিক সাহায্য করছেন রাজ্যের একজন মন্ত্রী। সাধুবাদ জানাই। কিন্তু এপ্রসঙ্গে এই প্রশ্নটাও রাখছি, একসাথে 2000 টাকার নোটে 2 লক্ষ টাকার বান্ডিলের উৎস কি? pic.twitter.com/TlisMituGG
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) June 6, 2023
Comments
Please login to add a commentAdd a comment