సాక్షి, వినుకొండ(పల్నాడు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినుకొండ పర్యటనలో బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు.
మస్తానమ్మ..
రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోయిందని, ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ సీఎం జగన్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకుంది. వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
తేజ..
బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి తేజ తండ్రి విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు.
చదవండి: ముసలాయనపై పేలిన సీఎం జగన్ పంచ్‌లు
ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, స్ధానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్ధలము, ఇల్లు కట్టుకోవడానికి నగదు మరియు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు. చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌తో చర్చించి సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.
చదవండి: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
Comments
Please login to add a commentAdd a comment