signals
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
సిగ్నల్ లోపం వల్లే రైలు ప్రమాదం
-
అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్
ఖగోళంలో మరో మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. విశ్వంలోని మరో పాలపుంత నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భూమికి మూడు బిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో ఉన్న పాలపుంత నుంచి ఈ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ సిగ్నల్స్‌ను గుర్తించడం ఇది రెండోసారి. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్స్(FRB)కు FRB20190520Bగా నామకరణం చేశారు. ఎఫ్ఆర్బీలకు కారణమేంటన్నది ఖచ్చితంగా తెలియదు కానీ.. న్యూట్రాన్ నక్షత్రం వెనుక వదిలిపెట్టిన సూపర్నోవా పేలుడు ద్వారా వెలువడిన దట్టమైన పదార్థంగా భావిస్తున్నారు. ‘నవజాత’ సిద్ధాంతం ప్రకారం, ఎఫ్ఆర్బీ వయసు పెరిగేకొద్దీ సంకేతాలు క్రమంగా బలహీనపడతాయని అంచనా. మే 2019లో చైనాలోని గుయిజౌలో ఐదు వందల మీటర్ల గోళాకార ఎపర్చరు రేడియో టెలిస్కోప్ (FAST)ని ద్వారా FRBని ట్రేస్ చేశారు. అదనపు పరిశీలనలు 2020లో ఐదు నెలల వ్యవధిలోనే.. దాదాపు 75 FRBలను నమోదు చేశాయి. తర్వాత US నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన కార్ల్ G జాన్స్కీ వెరీ లార్జ్ అర్రే ఈ సిగ్నల్స్‌ని స్థానీకరించారు. -
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో సంచలన వ్యాఖ్యలు
మనీలా: ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, అది తీవ్రమైతే పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నానంటూ అనూహ్య ప్రకటన చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. వైద్య పరీక్షల ఫలితాలకోసం ఎదురు చూస్తున్నాను. ఒక వేళ క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యం పాలయితే.. అదీ థర్డ్ స్టేజ్‌లో ఉండి, ఇక నివారణ అసాధ్యం అని తేలితే’ అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్లుతో ప్రసంగిస్తూ గురువారం రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించిన రొడ్రిగో అధికారాన్ని 2016లో చేపట్టినప్పటి నుంచి లక్షలాదిమందిని హతమార్చి ఆధునిక హిట్లర్‌గా విమర్శలు పాలయ్యాడు. మద్యపానం, ధూమపానం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే ఎండోస్కోపీ, కోలొనోస్కోపీ పరీక్షలు జరిగాయి. మరిన్ని పరీక్షలకు వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు అధ్యక్షుడిగా రోడ్రిగో ఆరేళ్ల పదవీ కాలం 2022తో ముగియనుంది. కాగా సభావేదికపై దేశాధ్యక్షుడు రోడ్రిగో ఇటీవల ఓ మహిళకు బహిరంగంగా ముద్దుపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ కూటమిలోకి కమల్ పార్టీ?
సాక్షి, చెన్నై: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. సోమవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంకాగా, కమల్ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. -
భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్!
ఒట్టావా: ఖగోళశాస్త్ర అధ్యయనంలో అంతు చిక్కని మరో మిస్టరీ. భారీ విస్పోటనం తాలుకూ సంకేతాలను కెనడాకు చెందిన ఓ రేడియో టెలిస్కోప్ గుర్తించింది. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి అంశం మళ్లీ తెరపైకి రాగా, ఆ రహస్యాన్ని చేధించే పనిలో సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఫాస్ట్ రేడియో బరస్ట్(ఎఫ్ఆర్బీ).. విశ్వంలో సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు ఫాస్ట్ రేడియో బరస్ట్‌గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 2007లో తొలిసారిగా శాస్త్రవేత్తలు ఎఫ్ఆర్బీని గుర్తించారు. గత పదేళ్లలో 30కిపైగా ఎఫ్ఆర్బీలు నమోదు అయ్యాయి. తాజాగా జూలై 25న ఎఫ్ఆర్బీకి సంబంధించిన సిగ్నల్స్‌ను కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్(CHIME) గుర్తించించింది. 2 మిల్లీసెకండ్స్ నిడివి, 700 మెగా హెడ్జ్(ఆలోపే) ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్‌ను టెలిస్కోప్ రికార్డు చేసింది. ఈ ఎఫ్ఆర్బీకి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ.. న్యూట్రన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ పేలుళ్లు, ఏలియన్స్.. వీటిలో ఏదో ఒకటి ఆ విస్పోటనానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది సంభవించినప్పటికీ అత్యంత శక్తివంతమైంది కావటంతోనే ఇంత దూరం ప్రయాణించగలిగిందని అంటున్నారు. మరుగుజ్జు పాలపుంత.. ఏలియన్స్ జాడకు సంబంధించి అధ్యయనానికి ఈ ఎఫ్ఆర్బీ కీలకంగా మారే అవకాశం ఉందన్నది వారి వాదన. -
ట్రాఫిక్ కష్టాలకు చెక్
అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపడం.. ఎటువైపు పడితే అటువైపు రయ్‌మంటూ దూసుకెళ్లడం.. రోడ్ బ్లాక్ అయితే చాలాసేపు రాకపోకలు స్తంభించిపోవడం.. వెరసి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడేవి. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, తక్కువ సిబ్బందితో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం కష్టమయ్యేది. వీటన్నింటినీ పరిశీలించిన ఎస్పీ అశోక్‌కుమార్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతపురం సెంట్రల్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. పండుగ వేళల్లో పాతూరు రోడ్లలో ప్రయాణించారంటే ‘వద్దురా బాబోయ్’ అనాల్సిందే. దీనంతటికీ కారణం పెరుగుతున్న జనాభా, వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు లేకపోవడమే. రోడ్లు ఆక్రమణలకు గురికావడం, ముఖ్యంగా ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లు ఇరుకుగా తయారయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ముందుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. ట్రాఫిక్ సిబ్బంది పెంపు ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఒక డీఎస్పీ, 59 మంది సిబ్బంది, అప్పుడప్పుడు తాత్కాలిక విధులకు 30 మంది ఏఆర్ విభాగం నుంచి సిబ్బందిని కేటాయించారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు సిబ్బందిని కేటాయించిన దాఖలాలు లేవు. వినియోగంలోకి సిగ్నలింగ్ వ్యవస్థ కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ అధికారుల అలసత్వం కారణంగా మనుగడ కోల్పోయాయి. సిబ్బంది చెమటోడ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేవారు. ఈ విషయం ఎస్పీ అశోక్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. వారం రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. దీని వలన ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. ప్రతి కూడలికి ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు ఏఎస్ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా పనిచేస్తుండటంతో ఎక్కడైనా సమస్య తలెత్తినపుడు వెంటనే పరిష్కరిస్తున్నారు. ఫ్లై ఓవర్‌పై స్పీడ్ కంట్రోల్ నగరంలో ప్రధానంగా ప్రమాదాలు జరిగే పీటీసీ ఫ్లైఓవర్‌పై స్పీడ్ నియంత్రణ కోసం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వర కూ ఒక ఎస్ఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్లతో విధులు నిర్వహిస్తున్నారు. హెచ్చరికలు చేస్తూ స్పీడ్ కంట్రోల్‌కు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో పాటు నగరంలో సిగ్నల్స్ మొత్తం పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమైన అపార్ట్స్‌మెంట్, వ్యాపార సముదాయాలు, హోటల్స్, లాడ్జీల వద్ద పార్కింగ్‌కు స్థలాలు చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని సర్కులర్ జారీ చేశాం. రాత్రి సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు దృష్టి పెట్టాం. ముఖ్యంగా పీటీసీ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలు నివారించేందుకు ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణయ్య, ట్రాఫిక్ డీఎస్పీ, అనంతపురం -
ఫోన్ దొంగలు దొరికిపోయారు..
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): దొంగలకు కొత్త టెక్నాలజీ చెక్ పెట్టింది.. ఫోన్ దొంగలు దొరికిపోతున్నారు.. సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్వేర్ రాకతో ఇట్టే దొరికిపోతున్నారు. ఫోన్ దొంగిలించి పరిపోతుండగా టెక్నాలజీ ఆధారంగా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. సత్యనారాయణపురానికి చెందిన పాతనేని పృధ్వీ సోమవారం తెల్లవారుజామున చైన్నె నుంచి రైలులో విజయవాడ స్టేషన్లో దిగాడు. స్టేషన్ బయటికి వచ్చిన తరువాత ఇంటికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది గమనించిన ముగ్గురు వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీసులకు సమాచారం.. తేరుకున్న పృధ్వీ ఇంటి చేరుకోగానే తన వద్ద నుంచి సెల్ఫోన్లో ఏర్పాటు చేసుకున్న సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముగ్గురు యువకులు కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆంజనేయ వాగు, జోడు బొమ్మల సెంటర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఫోన్ లాక్కుని వెళ్లిన యువకులతో పాటు వారు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
నిర్లక్ష్యపుముద్ర
♦ అందని సిగ్నల్స్ ♦ మొరాయిస్తున్న సర్వర్లు ♦ మందకొడిగా పింఛన్ల పంపిణీ ♦ వెర్షన్ మారినా తప్పని వెతలు ♦ లబ్ధిదారులకు అవస్థలు భీమడోలు : రోజుకో కొత్త పరికరం.. సహకరించని అప్డేట్ వెర్షన్లు.. సర్వర్ మొరాయింపు.. అందని సిగ్నల్స్, పడని వేలి ముద్రలు ఇవి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎదురవుతోన్న సమస్యలు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నా లక్ష్యం మేరకు ప్రక్రియ పూర్తికావడంలేదు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈనెల ఏడో తేదీ నాటికే పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాలు నెరవేరేలాలేవు. సిగ్నల్స్ అందక సర్వర్ మొరాయించడంతో మండుటెండలోనే లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 3,72,816 మంది సామాజిక పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 3,16,482 మందికి అంటే 84.75 శాతం ప్రక్రియ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. భీమడోలు మండలానికి 16 ట్యాబ్‌లు ఇచ్చినా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మండకొడిగా సాగుతోంది. ఈ మండలంలో 6,578 లబ్ధిదారులు ఉండగా 5,281కి పింఛను సొమ్ము అందించారు. అంటే ఇప్పటికి 80.28 శాతం పూర్తయింది. జిల్లాలోని 57 మండలాల్లో కొవ్వూరు అర్బన్ పింఛన్ల పంపిణీలో ఈ నెల మొదటి స్థానంలో ఉండగా, భీమడోలు మండలం 46వ స్థానంలో ఉంది. కొవ్వూరు అర్బన్ పరిధిలో 2,799 మందికి 2,685 మందికి పింఛన్లు అందించారు. అంటే 95.93 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది. త్రీజీ ట్యాబుల్లో కొత్త వెర్షన్‌తో ఇబ్బందులు ప్రస్తుతం మార్కెట్లో 4జీ ట్యాబ్‌లు హల్చల్ చేస్తున్నా అధికారులు మాత్రం త్రీజీ ట్యాబ్‌లను అందించి చేతుల దులుపుకోవడంతో పింఛన్ల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. రెండున్నరేళ్ల క్రితం పంపిణీ చేసిన బీఓ ట్యాబ్‌ల్లో 3.2 నుంచి పలు వెర్షన్లు మార్పు చేసి గత నెల వరకు అందించారు. ఈ నెల కొత్త ట్యాబ్‌ల్లో నూతన వెర్షన్‌ను పొందుపర్చారు. ఇదే సమస్యగా మారింది. 3జీ ట్యాబుల్లో 4.2 వెర్షన్ అప్డేట్ చేయడంతో సహకరించడంలేదు. బయోమాట్రిక్ మెషీన్లలో వేలిముద్రలు పడడంలేదు. దీంతో లబ్ధిదారులు రెండు మూడు రోజులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. పనిచేసే చోట మూడు గంటలకే మెషీన్ చార్జింగ్ అయిపోతుంది. గతంలో వలే మెషీన్ పనిచేస్తుండగా చార్జీంగ్ పెట్టే పరిస్థితి ఇప్పుడులేదు. దీంతో చార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్ పెట్టాల్సి వస్తోంది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
దిక్కులేని సిగ్నల్స్
నగరంలో పనిచేస్తున్న సిగ్నల్స్ ఆరు 23 చోట్ల పనిచేయని వైనం పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు సతమతమవుతున్న ట్రాఫిక్ పోలీసులు రాజధాని నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ భ్రష్టుపట్టడంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నిత్యం ముఖ్యమంత్రి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు అనేకమంది నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరి వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. తరచూ రూట్ డైవర్షన్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్నా సౌకర్యాలు మాత్రం మున్సిపాలిటీని తలపిస్తున్నాయి. వాహనచోదకులకు దిక్కులు చూపించాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దిక్కూదివాణం లేనివిగా తయారయ్యాయి. విజయవాడ : రాజధాని అవసరాలకు తగ్గట్లు నగరానికి వసతులు సమకూరడం లేదు. తక్షణ అవసరాల్లో ఒకటైన ట్రాఫిక్ వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి అధ్వానంగా తయారైంది. నగరంలో అనేక రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, ఇతర ట్రాఫిక్ జంక్షన్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. నగరంలో 29 చోట్ల మాత్రమే సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. అవి కూడా కొన్నేళ్ల కిందట ఏర్పాటుచేసిన సిగ్నల్స్ కావడంతో పూర్తిగా అటకెక్కాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా అధిక ప్రాధాన్యత లేని ప్రాంతాల్లోని సిగ్నల్స్ కావడం గమనార్హం. విజయవాడలో రోజుకు సగటున 3.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానమైన బందరు రోడ్డులో కంట్రోల్ రూమ్ నుంచి బెంజిసర్కిల్ వరకు నాలుగు సిగ్నల్స్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిర్మల కాన్వెంట్ సెంటర్, రమేష్ హాస్పిటల్ సెంటర్, దీప్తి జంక్షన్ సెంటర్, చుట్టుగుంట సెంటర్, సీతన్నపేట గేటు, వెటర్నరీ కాలనీ రోడ్డులోని సిగ్నల్స్ మినహా మిగిలినవి అన్ని అట్టకెక్కాయి. విఐపి జోన్‌గా మారిన బందరు రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో నిత్యం 35 మంది ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద ఉండి షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. వారున్నంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ట్రాఫిక్ గజిబిజి గందరగోళంగా మారుతోంది. దీనికితోడు సీఎం ఈ రూట్లో పర్యటించినప్పుడల్లా గ్రీన్ జోన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్‌ను నిలిపివేస్తుంటారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో గందరగోళం నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించి సిగ్నల్స్, జంక్షన్ల వద్ద మార్కింగ్ ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అటు వాహనదారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కనకదుర్గ ఫ్లైవోవర్ నిర్మాణపనుల వల్ల జాతీయ రహదారి ట్రాఫిక్ మొత్తం చిట్టినగర్, చనుమోలు వెంకట్రావ్ ఫ్లైవోవర్, సొరంగం వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా 30 అడుగుల లోపు ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా నగరంలోని రోడ్డు అవసరమైన చోట్ల విస్తరణ చేయాల్సి ఉన్నా నగరపాలక సంస్థ పట్టించుకోవటం లేదు. సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులదే. మరో నాలుగు నెలల్లో పుష్కరాలు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య పెనసవాలుగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారితో అనుసంధానంగా ఉన్న బెంజిసర్కిల్ వద్ద సిగ్నల్స్ వద్ద రెడ్‌లైట్ వయొషన్ కెమోరా ఉన్నప్పటికి పనిచేయటం లేదు. దీంతో ఈసెంటర్లో ఆరుగురికిపైగా పోలీసులతో పాటు అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. -
చలో అంటే చలానే
ఫలితాలిస్తున్న కాప్‌లెస్ జంక్షన్లు నెలలో 6400 కేసులు నమోదు అత్యధికం సిగ్నల్ ఉల్లంఘనలే విస్తరణకు ఉన్నతాధికారుల కసరత్తు చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని సిగ్నల్స్ బేఖాతరు చేస్తూ దూసుకుపోతున్నారా? జాగ్రత్త... వాళ్లు మీ కంటికి కనిపించకపోయినా మీపైన కన్నేసే ఉంటారు. ఏ ఉల్లంఘనకు పాల్పడినా మరో జంక్షన్‌కు చేరేసరికి చలాన్ సిద్ధమవుతుంది. ఇదీ ‘కాప్‌లెస్ జంక్షన్’ ప్రత్యేకత. రహదారి నిబంధనలపై వాహన చోదకుల్లో అవగాహనతో పాటు క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసినవే కాప్‌లెస్ జంక్షన్స్. ప్రయోగాత్మకంగా 13 చోట్ల అమలవుతున్న ఈ విధానం ప్రారంభమై నెల రోజులైంది. ఈ కాలంలో ట్రాఫిక్ కాప్స్ ఉల్లంఘనులపై 6,441 కేసులు నమోదు చేసి... రూ.31.5 లక్షల జరిమానా విధించారు. సిటీబ్యూరో: ఓ ప్రాంతంలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారంటే నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసుల ద్వారా మాన్యువల్‌గా నియంత్రించాల్సిన అవసరం లేదని అర్థం. నగరంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా... లేకున్నా సిబ్బంది మోహరింపు తప్పనిసరిగా మారిపోయింది. అలా లేకుంటే వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘించి దూసుకుపోతూ ప్రమాదాలబారిన పడటం... ప్రమాదాలకు కారకులుగా మారడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులూ సృష్టిస్తున్నారు. ఈ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నగర పోలీసులు ‘కాప్‌లెస్ జంక్షన్స్’ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. కెమెరాలు, చాటు బృందాలు... ప్రస్తుతం నగరంలో 13 చౌరస్తాల్లో కాప్‌లెస్ జంక్షన్స్ విధానం అమలులో ఉంది. అత్యధికంగా మారేడ్‌పల్లి, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు, మూడేసి జంక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ చౌరస్తాల్లో ఎక్కడా పాయింట్ డ్యూటీల్లో ట్రాఫిక్ సిబ్బంది కనిపించరు. కాస్త దూరంలో మాటు వేసి ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను గుర్తిస్తుంటారు. వీరి కంటే ఎక్కువగా చౌరస్తాల్లోని కెమెరాలతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఉల్లంఘనులపై కన్నేసి ఉంచుతారు. ఎవరైనా వాహన చోదకుడు నిబంధనలు బేఖాతరు చేస్తూ దూసుకుపోతే తక్షణం గుర్తిస్తారు. ఆ వ్యక్తి వెళ్తున్న మార్గంలో ముందున్న చౌరస్తాకు సమాచారం ఇస్తారు. దీంతో అక్కడి సిబ్బంది ఉల్లంఘనులను ఆపి... జరిమానా విధిస్తారు. క్రమశిక్షణ పెంచేందుకే ... కాప్‌లెస్ జంక్షన్లు అనేవి పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. అక్కడ రోడ్లపై ఎక్కడా పోలీసులు కనిపించరు. అయినప్పటికీ పక్కా నిఘా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసి ఉండటంతో ఎవరికి వారు క్రమశిక్షణతో మెలుగుతారు. ఇదే విధానాన్ని హైదరాబాద్ వాహనచోదకులకు అలవాటు చేసి... క్రమశిక్షణ పెంచాలన్నదే ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం. - ఎం.మహేందర్‌రెడ్డి, కొత్వాల్ మరోచోట వినియోగిస్తున్నాం ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాప్‌లెస్ జంక్షన్ల నుంచి ఉపసంహరిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను మరోచోట వినియోగిస్తున్నాం. వాహన చోదకుల్లో స్వీయ క్రమశిక్షణ కు తోడ్పడే ఈ జంక్షన్ల సంఖ్యను త్వరలో 25కు పెంచాలని యోచిస్తున్నాం. వీటి నిర్వహణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర. - జితేందర్, ట్రాఫిక్ చీఫ్ -
పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్ల రాకపోకల్లో అవాంతరం
గొల్లప్రోలు (తూర్పు గోదావరి) : భారీ వర్షాలు, ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేహట్ కుప్పకూలిపోయింది. దీంతో సిగ్నల్, టెలికం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్లరాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మాన్యువల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో ఆ స్టేషన్ల మధ్య రైళ్లు నెమ్మదిగా ప్రయాణించాయి. రైల్వే డివిజనల్ ఇంజనీర్ దీనదయాళ్ నేతృత్వంలో విజయవాడ, రాజమండ్రి, తుని, సామర్లకోట స్టేషన్లకు చెందిన రైల్వే సిబ్బంది శనివారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా సిగ్నల్హట్ను తీసుకువచ్చి బోర్డుకు అమర్చి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని డీఈ చెప్పారు. -
రేపు సెంట్రల్, హార్బర్ మార్గాల్లో మెగాబ్లాక్
సాక్షి, ముంబై: రైల్వే ట్రాక్స్, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం సెంట్రల్, హార్బర్ మార్గంలో మెగాబ్లాక్ ప్రకటించారు. దీని కారణంగా కొన్ని రైళ్లను దారిమళ్లించగా మరికొన్నింటిని రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా సెంట్రల్ రైల్వే మార్గంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఠాణే-కల్యాణ్ స్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్ మార్గంలో మెగాబ్లాక్ ఉంటుంది. దీంతో ఠాణే నుంచి కల్యాణ్ దిశగా వెళ్లే లోకల్ రైళ్లు, దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ స్లో మార్గంలో నడుస్తాయి. అదేవిధంగా హార్బర్ మార్గంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-కుర్లా స్టేషన్ల మధ్య డౌన్ మార్గంలో, వడాల రోడ్-బాంద్రా మధ్య అప్, డౌన్ మార్గంలో ఉదయం 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మెగాబ్లాక్ పనులు జరుగుతాయి. ఈ సమయంలో కొన్ని లోకల్ రైళ్ల ట్రిప్పులను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. రైళ్ల రాకపోకల తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో మైక్‌లో ఎప్పటికప్పుడు ప్రకటిస్తారని, ఆ ప్రకారమే తమ ప్రయాణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు. -
సెల్వన్ సేవలు నిల్
13 రోజుల నుంచి అందని సిగ్నల్స్ వినియోగదారుల ఆగ్రహం బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తళాలు కార్యాలయం ఎదుట ఆందోళన అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో పెదబయలు, న్యూస్‌లైన్ :సెల్ పని చేయదు.. విల్ మోగదు.. ల్యాండ్‌లైన్ పలకదు.. 13 రో జులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించకపోవడంతో వినియోగదారులు శనివారం రోడ్డెక్కారు. సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది జాడ లేకపోవడంతో మండిపడ్డారు. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాల యానికి తాళాలు వేశారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. 13 రోజుల నుంచి సిగ్నల్ లేకపోయినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఫోన్లు చేసుకోవాలంటే పాడేరు వరకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్న, అధికారుల నుంచి సమాచారం ఉండడం లేదని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఫోన్ చే యడానికి పాడేరు వెళ్తున్నామని తెలిపారు. స్థానిక సెల్‌టవర్‌కు సంబంధించి టె క్నికల్ సిబ్బంది, జేఈఈ, ఇతర అధికారుల ప ర్యవేక్షణ లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిం దన్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు విసుగు తెప్పిస్తున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వినియోగదారులు హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్, విద్యుత్ శాఖ అధికారులపై ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తామని సీపీఎం నాయకుడు బొండా సన్నిబాబు, స్థానికులు దడియా రాంబాబు, ఎం. పోతురాజు, లక్ష్మీనారాయణ, వర్తకులు తెలిపారు.