ఒట్టావా: ఖగోళశాస్త్ర అధ్యయనంలో అంతు చిక్కని మరో మిస్టరీ. భారీ విస్పోటనం తాలుకూ సంకేతాలను కెనడాకు చెందిన ఓ రేడియో టెలిస్కోప్ గుర్తించింది. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి అంశం మళ్లీ తెరపైకి రాగా, ఆ రహస్యాన్ని చేధించే పనిలో సైంటిస్టులు నిమగ్నమయ్యారు.
ఫాస్ట్ రేడియో బరస్ట్(ఎఫ్‌ఆర్‌బీ).. విశ్వంలో సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు ఫాస్ట్ రేడియో బరస్ట్‌గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 2007లో తొలిసారిగా శాస్త్రవేత్తలు ఎఫ్‌ఆర్‌బీని గుర్తించారు. గత పదేళ్లలో 30కిపైగా ఎఫ్‌ఆర్‌బీలు నమోదు అయ్యాయి. తాజాగా జూలై 25న ఎఫ్‌ఆర్‌బీకి సంబంధించిన సిగ్నల్స్‌ను కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పెరిమెంట్ టెలిస్కోప్(CHIME) గుర్తించించింది. 2 మిల్లీసెకండ్స్ నిడివి, 700 మెగా హెడ్జ్(ఆలోపే) ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్‌ను టెలిస్కోప్ రికార్డు చేసింది.
ఈ ఎఫ్‌ఆర్‌బీకి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ.. న్యూట్రన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ పేలుళ్లు, ఏలియన్స్.. వీటిలో ఏదో ఒకటి ఆ విస్పోటనానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది సంభవించినప్పటికీ అత్యంత శక్తివంతమైంది కావటంతోనే ఇంత దూరం ప్రయాణించగలిగిందని అంటున్నారు. మరుగుజ్జు పాలపుంత.. ఏలియన్స్ జాడకు సంబంధించి అధ్యయనానికి ఈ ఎఫ్‌ఆర్‌బీ కీలకంగా మారే అవకాశం ఉందన్నది వారి వాదన.
Comments
Please login to add a commentAdd a comment