పోలీసుల అదుపులో ఉన్న యువకులు, స్వాధీనం చేసుకున్న బైక్
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): దొంగలకు కొత్త టెక్నాలజీ చెక్ పెట్టింది.. ఫోన్ దొంగలు దొరికిపోతున్నారు.. సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్‌వేర్ రాకతో ఇట్టే దొరికిపోతున్నారు. ఫోన్ దొంగిలించి పరిపోతుండగా టెక్నాలజీ ఆధారంగా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
వివరాలు.. సత్యనారాయణపురానికి చెందిన పాతనేని పృధ్వీ సోమవారం తెల్లవారుజామున చైన్నె నుంచి రైలులో విజయవాడ స్టేషన్‌లో దిగాడు. స్టేషన్ బయటికి వచ్చిన తరువాత ఇంటికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది గమనించిన ముగ్గురు వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు.
పోలీసులకు సమాచారం..
తేరుకున్న పృధ్వీ ఇంటి చేరుకోగానే తన వద్ద నుంచి సెల్‌ఫోన్‌లో ఏర్పాటు చేసుకున్న సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముగ్గురు యువకులు కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆంజనేయ వాగు, జోడు బొమ్మల సెంటర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఫోన్ లాక్కుని వెళ్లిన యువకులతో పాటు వారు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment