
సాక్షి, చెన్నై: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. సోమవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంకాగా, కమల్ మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.