ఖగోళంలో మరో మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. విశ్వంలోని మరో పాలపుంత నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
భూమికి మూడు బిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో ఉన్న పాలపుంత నుంచి ఈ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ సిగ్నల్స్‌ను గుర్తించడం ఇది రెండోసారి. ఈ ఫాస్ట్ రేడియో బర్‌స్ట్స్(FRB)కు FRB20190520Bగా నామకరణం చేశారు.
ఎఫ్‌ఆర్‌బీలకు కారణమేంటన్నది ఖచ్చితంగా తెలియదు కానీ.. న్యూట్రాన్ నక్షత్రం వెనుక వదిలిపెట్టిన సూపర్నోవా పేలుడు ద్వారా వెలువడిన దట్టమైన పదార్థంగా భావిస్తున్నారు. ‘నవజాత’ సిద్ధాంతం ప్రకారం, ఎఫ్‌ఆర్‌బీ వయసు పెరిగేకొద్దీ సంకేతాలు క్రమంగా బలహీనపడతాయని అంచనా.
మే 2019లో చైనాలోని గుయిజౌలో ఐదు వందల మీటర్ల గోళాకార ఎపర్చరు రేడియో టెలిస్కోప్ (FAST)ని ద్వారా FRBని ట్రేస్ చేశారు. అదనపు పరిశీలనలు 2020లో ఐదు నెలల వ్యవధిలోనే.. దాదాపు 75 FRBలను నమోదు చేశాయి. తర్వాత US నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన కార్ల్ G జాన్స్కీ వెరీ లార్జ్ అర్రే ఈ సిగ్నల్స్‌ని స్థానీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment