U-19 World Cup, IND Vs Ire: India Cruise Past Ireland In Group B Fixture, Qualify For Super League Stage - Sakshi

ఒక వైపు కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌కి పాజిటివ్‌.. అయినా టీమిండియా ఘ‌న విజ‌యం..

Jan 20 2022 9:13 AM | Updated on Jan 20 2022 11:03 AM

India Cruise Past Ireland In Group B Fixture, Qualify For Super League Stage - Sakshi

U-19 World Cup, IND Vs Ire: అండర్-19 ప్రపంచకప్‌లో భార‌త్ జోరు కోన‌సాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌పై 174 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజ‌యంతో క్వార్టర్‌ ఫైనల్ బెర్త్‌ను భార‌త్ ఖ‌రారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది.

ఓపెనర్లు హర్నూర్ సింగ్(88), రఘువంశీ(79) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భార‌త్ భారీ స్కోర్ సాధించ‌గ‌ల్గింది. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకే కూప్ప‌కూలింది. భారత బౌల‌ర్ల‌లో సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా... విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ సాధించారు. 

భార‌త అండర్-19 ఆరుగురు పాజిటివ్‌
కాగా మ్యాచ్‌కు ముందు భార‌త శిబిరంలో  కరోనా కలకలం రేపింది.  భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఈ మ్యాచ్‌లో నిశాంత్ సింధు భార‌త జ‌ట్టుకు నాయ‌కత్వం వ‌హించాడు.

చ‌ద‌వండి: SA vs IND: తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement