
PC: Asia Cricket Council
ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే!
Under 19 World Cup 2022- జార్జ్‌టౌన్ (గయానా): వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల పోరు శనివారం ఆరంభం కానుంది. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నాలుగు సార్లు చాంపియన్ అయిన భారత్ టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇక ఇటీవలే జరిగిన జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ జోరు ముందు సఫారీ నిలవడం కష్టమే! భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒత్వాల్, గర్వ్ సంగ్వాన్.
దక్షిణాఫ్రికా జట్టు:
ఈథన్ జాన్ కనింగ్‌హాం, వాలంటైన్ కిటిమె, డేవడ్ బ్రెవిస్, జీసే మ్యారీ, జార్జ్ వాన్ హీర్డన్, ఆండిలే సిమెలేన్, మిక్కీ కోప్లాండ్, మాథ్యూ బోస్ట్, లియామ్ ఆల్డర్, అఫివే న్యాండ, క్వెనా మఫాకా, ఆసఖే షాకా, జేడ్ స్మిత్ , కేడన్ సోలోమన్, జోషువా స్టీఫెన్సన్.
చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి