ప్రేమ కోసం రషీద్ .. రాహుల్గా మారాడు | Muslim man converts in hindhu for lovemarriage | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసం రషీద్ .. రాహుల్గా మారాడు

Published Fri, Oct 27 2017 7:40 PM | Last Updated on Fri, Oct 27 2017 7:58 PM

Muslim man converts in hindhu for lovemarriage

చిన్నశంకరంపేట (మెదక్‌): ప్రియురాలి కోసం ఓ రాజు భాగ్యనగరం నిర్మించారని విన్నాం. ప్రేమ కోసం తాజ్‌ మహల్‌ నిర్మించారని చరిత్రలో చూస్తున్నాం. లవ్‌ జిహాద్‌ ఆరోపణలనూ గమనిస్తున్నాం. కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారిన ముస్లిం యువకుడి కథ ఇది. 

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామానికి చెందిన ఎండీ రషీద్‌ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే తమ ప్రేమ పెళ్లికి అడ్డుగా నిలుస్తారని భావించారు. ఎవరికీ తెలియకుండా సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేయాలంటే ఇద్దరు హిందువులే అయి ఉండాలని చెప్పడంతో రషీద్‌ మతం మారేందుకు నిర్ణయించుకున్నాడు. తన పేరును రాహుల్‌గా మార్చుకుని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ నెల 25న మతం మారడంతోపాటు, పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ జంట చిన్న శంకరంపేట పోలీస్‌లను కలిసి ఇక ముందు తాము తల్లిదండ్రులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. యువకుడు హైదరాబాద్‌లోని జియో టెలికాం సంస్థలో పనిచేస్తుండగా, అమ్మాయి డీఈడీ చదువుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement