కరీంనగర్‌లో కార్డన్ సెర్చ్
కరీంనగర్: నగరంలోని హుస్సెనీపుర, ప్రియదర్శని కాలనీలను పోలీసులు దిగ్బంధం చేశారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం వేకువజామున 200మంది పోలీసులు ఒక్కసారిగా రెండు కాలనీల్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు.
ఈ సదంర్భంగా సరైన పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రౌడీషీటర్‌తోపాటు నలుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమం మద్యాన్ని గుర్తించి బెల్ట్ షాప్‌ను సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహించామని సీపీ తెలిపారు.