వివరాలు వెల్లడిస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి
సాక్షి,కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్‌లో కొంతకాలంగా మట్కా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని మారుతినగర్‌కు చెందిన కమటం రమేÐశ్(56), చొప్పదండి మండలం గణేష్‌నగర్‌కు చెందిన ఒదెల రాజు(52), కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన వనం రాము(48), బొమ్మదేవి శ్రీనివాస్(45), కోతిరాంపూర్‌కు చెందిన బత్తిని సత్యనారాయణ(50), కొత్తపల్లి మండలానికి చెందిన కన్న అంజిబాబు(55), కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన కుక్కల నరేందర్(36) ముఠాగా ఏర్పడి కరీంనగర్‌లో మట్కా నిర్వహిస్తున్నారు.
ఏజెంట్‌లుగా..!
కొందరు మట్కా నిర్వహణకు ఏజెంట్లుగా మారారు. రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్ చేసి ఏజెంట్‌గా మారారు. కల్యాణిగా వ్యవహరించే ఈ మట్కా ఆటలో సింగిల్ డిజిట్ వస్తే రూ.100కు రూ.800, ఓపెన్, డబుల్ నంబర్లు వస్తే రూ.100కు రూ.8వేలు, మూడు నంబర్లు వస్తే ఓపెన్ పానగా పేర్కొంటూ రూ.100కు రూ.10వేలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. శని, ఆదివారాలు తప్పా మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, మళ్లీ 9 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రెండుసార్లు డ్రాలు తీసి నంబర్లు చెబుతారు. వారు చెప్పిన నంబర్లపై పందెం కాసిన వారికి డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పటికీ ఈ ఆటలో ఎవరికీ డబ్బులు రాలేదు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. మాట్కా నిర్వాహకులు ఏడుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.50వేలు నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హిస్టరీషీట్లు
ప్రజలు కష్టార్జీతాన్ని నమ్ముకోవాలే తప్పా ఇలాంటి వాటిని నమ్మొద్దని సీపీ కోరారు. రెండు అంతకన్న ఎక్కువ కేసులు ఉన్న జూదరులపై హిస్టరీషీట్లు ఓపెన్ చేసి నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు 30 మంది మట్కా నిర్వాహకులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో 10 మందిపై రెండు అంతకన్న ఎక్కువ కేసులున్నాయని.. వారిపై హిస్టరీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment