జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌ | Police Cordon Search Operation In Karimnagar District | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌

Published Fri, Apr 21 2017 8:37 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌

జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌

జమ్మికుంట: కరీంనగర్‌జిల్లా జమ్మికుంట పట్టణంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దుర్గా కాలనీలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా 10 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, రూ.30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు, బాణసంచా, మద్యం నిల్వలు, 25 లీటర్ల కిరోసిన్‌, 4 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 300 పోలీసులు పాల్గొన్నారు. కాగా, జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో జనగణమన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement