ప్రతీకాత్మక చిత్రం
కరీంనగర్ క్రైం: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి.. చోరీలకు పాల్పడుతున్న యువకుడిని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కన్నమల్ల మల్లేశం కొద్ది రోజుల క్రితం భగత్‌నగర్‌కు వెళ్లేందుకు స్థానిక బస్టాండ్ వద్ద నిరీక్షిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన గుంటి సురేష్(29) లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన స్కూటీపై తీసుకెళ్లి కట్టరాంపూర్‌లో శివారులో అతని వద్ద ఉన్న బంగారం, డబ్బులు లాక్కెళ్లాడు. ఈ ఘటనపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం వేములవాడకు చెందిన పందిళ్ల అనిల్‌కుమార్ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఉండగా.. లిఫ్ట్ ఇస్తానని శివారులోకి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న బంగారం, విలువైన వస్తువులు చోరీచేశాడు. ఈ ఘటనపై సీసీఎస్ సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతడిని చాకచక్యంగా పట్టుకుని వన్‌టౌన్ పోలీసులు సహాయంతో రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, వన్‌టౌన్ ఎస్సై నాగరాజు, ఏఎస్సై వీరయ్య, సీసీఎస్ సిబ్బంది హసన్, లక్ష్మీపతి, అంజయ్యలను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment