యాదగిరి గుట్టలో కార్డెన్ సెర్చ్
యాదగిరి గుట్ట: నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలో భువనగిరి డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో ఐదుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు. రహదారిలో వాహనాలను కూడా తనిఖీ చేశారు.