భారీగా వాహనాలు, లాడ్జీల తనిఖీలు! | Cyberabad Police conducted cordon search | Sakshi
Sakshi News home page

భారీగా వాహనాలు, లాడ్జీల తనిఖీలు!

Published Sat, Feb 13 2016 2:52 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

Cyberabad Police conducted cordon search

హైదరాబాద్‌: సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించారు. నేరాలను నిరోధించేందుకు ముందుజాగ్రత్తగా చేపట్టిన ఈ గస్తీ ఆపరేషన్‌లో సైబరాబాద్ కమిషనరేట్ అధికారాలంతా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లాడ్జీల్లో క్షణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల సోదాలు నిర్వహించారు.

అదేవిధంగా షాహీనగర్, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సౌత్‌ జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 20 బృందాలు ఏకకాలంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఏడుగురు రౌడీషీటర్లు, 11 నిందితులు, ఒక నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్న నిందితుడు, ఒక హత్యకేసు నిందితుడు.. మొత్తంగా 50 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 45 ద్విచక్ర వాహనాలు, రెండు వాహనాలు, ఏడు ఆటోలు, మూడు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కర్డన్ సెర్చ్‌లో డీసీపీ సత్యనారాయణ స్వయంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆస్ట్రేలియా పోలీసులు ఈ వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement