సికింద్రాబాద్ తుకారాంగేటు ప్రాంతంలోని మాంగారి బస్తీలో పోలీసులు శనివారం వేకువజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ తుకారాంగేటు ప్రాంతంలోని మాంగారి బస్తీలో పోలీసులు శనివారం వేకువజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. బస్తీలోని ఇంటింటినీ సోదా చేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో కొనసాగిన సెర్చ్ లో 200మంది పోలీసులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.