
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బుకింగ్ లేకుండా ప్రయాణికులను కార్లలో ఎక్కించుకోవడం ఎయిర్‌పోర్టులో నిషేధం ఉంది. అయితే, కొంత కాలంగా విమానాశ్రయంలో కొందరు డ్రైవర్లు ఈవిధంగా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. గతంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించగా కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో కూడా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు కూడా ముందస్తు బుకింగ్ ఉన్న కార్లలోనే ప్రయాణించడం క్షేమమని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఆర్‌జీఐఏ సీఐ గంగాధర్, సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment