
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గురువారం వెకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బహుదూర్‌పురలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
కిషన్‌బాగ్ దాల్‌మండిలో 300 మంది పోలీసులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితుల అరెస్ట్ చేశారు. సరైన ధృవపత్రాలులేని వాహనాలు సీజ్ చేశారు. మారణాయుధాలను స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై దాడులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment