Hukka centers
-
స్నేహితులతో కలిసి ఉంటున్న ప్లాట్‌లో..
బంజారాహిల్స్(హైదరాబాద్): తమ ఫ్లాట్‌నే హుక్కా సెంటర్‌గా మార్చిన ముగ్గురు యువకులు నిబంధనలు ఉల్లంఘించి హుక్కా తాగుతుండగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆ ఫ్లాట్‌పై దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడమే కాకుండా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కమలాపురి కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో కమలాపురి కాలనీకి చెందిన వ్యాపారి వంశీపల్లె(34), ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఇమ్రాన్(27), యూసుఫ్‌గూడకు చెందిన పి.సిద్దు(27) కొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి హుక్కా తాగుతుండటమే కాకుండా తమ స్నేహితులను రప్పించి హుక్కా సరఫరా చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఇక్కడ దాడులు నిర్వహించగా ముగ్గురు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హుక్కా ఆన్ వీల్స్!
సాక్షి, సిటీబ్యూరో: హుక్కా పార్లర్లపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ దందా చేసేవాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ వాటిని అనుసరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకులు, హుక్కా పీల్చే వారితో కలిపి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి ఓమ్నీ వాహనంతో పాటు రూ.2 లక్షల విలువైన హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి గురువారం వెల్లడించారు. పాతబస్తీలోని మచిలీ క కమాన్ ప్రాంతానికి చెందిన అలీ, అబ్దుల్ కరీం గతంలో రఫీఖ్ ట్రేడర్స్ పేరుతో హుక్కా వ్యాపారం నిర్వహించారు. సిటీలో హుక్కా పార్లర్స్ ను నిషేధించడం, అక్రమ వ్యాపారంపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ ద్వయం కొత్త మార్గాలు అన్వేషించింది. కొన్ని నెలల క్రితం ఓ ఓమ్మీ వ్యాన్ ఖరీదు చేసిన వీరు అందులో కొన్ని మార్పులు చేసి తెరలు ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన హుక్కా పాట్స్, మెటీరియల్, వివిధ ఫ్లేవర్లు అందులో పెట్టుకుంటున్నారు. ఈ వాహనంతో సహా వీరిద్దరూ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పరిచయస్తులు, వారి సిఫార్సుతో వచ్చిన వారికి ఆయా ఫ్లేవర్లకు చెందిన హుక్కా పాట్స్ అందిస్తున్నారు. దీనికి వారి నుంచి నిర్ణీత మొత్తం వసూలు చేస్తూ తమ వాహనం చాటునే కూర్చుని హుక్కా పీల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా పాతబస్తీలో అనేక మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకున్న ఈ ద్వయం వారి వద్దకే వెళ్తూ వారికి హుక్కా పీల్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు కొందరికి పాట్స్, హుక్కా ఫ్లేవర్స్ విక్రయిస్తోంది. కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేత్రుత్వంలో రంగంలోకి దిగిన టీమ్ వలపన్ని మీర్‌చౌక్ ప్రాంతంలో వాహనాన్ని పట్టుకుంది. అందులో ఉన్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిని పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించింది. -
పగలు రాత్రి రేవ్ పార్టీలు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : నందికొండ చుట్టుపక్కల పరిసరాల్లోన్న హుక్కాబార్‌లు, రిసార్ట్లు, ఫాంహౌస్‌లలో జరుగుతున్న రేవ్ పార్టీలు, మత్తు పార్టీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పగలు రాత్రి ప్రశాంతత కరువయిందని తాలూకా పంచాయతీ సభ్యుడు, జిల్లా జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్ సునీల్ ఆరోపించారు. శుక్రవారం దొడ్డ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశీయులు సైతం ఈ పార్టీలలో హాజరవుతున్నారన్నారు. రేవ్ పార్టీల పేరుతో మత్తు పదార్థాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారన్నారు. చీకటి పడిందంటే పెద్దపెద్ద శబ్దాలతో డీజే సౌండ్‌తో పార్టీలు ప్రారంభమవుతాయన్నారు. దేశ, విదేశాల యువతులు గుంపులుగా వస్తున్నారని, దీంతో లోపల ఏం జరుగుతోందో ఊహించవచ్చన్నారు. నందికొండ చుట్టుపక్కల, ఘాటిసుబ్రమణ్య పుణ్యక్షేత్రం పరిసరాల్లోనూ రిసార్ట్‌లలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పోలీసులు అన్నీ తెలిసీ మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మత్తు పదార్థాల వ్యర్థాలు, మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున చెరువుల్లో ప్రత్యక్షమవుతున్నాయని, దీంతో చెరువులు కూడా కలుషితమవుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలీసులు ఇప్పటికయినా మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. -
15 కేసులు.. అయినా మారని తీరు
బంజారాహిల్స్: ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 15 కేసులు... ఇప్పటి వరకు 10 సార్లు జైలుకు..15 సార్లు న్యాయస్థానానికి.. అయినా సరే ప్రవర్తనలో మార్పు లేకపోగా అదే తప్పును పదేపదే చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మరోసారి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో నివసించే మహ్మద్ జీషన్ అహ్మద్(32) జూబ్లీహిల్స్ రోడ్ నెం:1/9లో హైదరాబాద్ టైమ్స్ కేఫ్(హెచ్‌టీసీ) పేరుతో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నాడు. 2016లో ప్రారంభమైన ఈ హుక్కా సెంటర్‌ను తరచూ పోలీసులు దాడులు చేసి సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడు జీషన్ అహ్మద్‌పై కేసులు నమోదు చేస్తూ కోర్టులో హాజరుపరుస్తూ జైలుకు పంపిస్తున్నా బెయిల్‌పై రాగానే మళ్లీ హుక్కా సెంటర్ నడిపిస్తున్నాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఫర్నిచర్‌తో సహా సీజ్ చేసినా సరే వినిపించుకోకుండా కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేసి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఎన్ని సార్లు జైలుకి వెళ్లినా తీరు మార్చుకోకుండా పగలు, అర్థరాత్రి అనే తేడా లేకుండా తనకు తెలిసిన కస్టమర్లను పిలిపించుకుంటూ హుక్కా సరఫరా చేస్తు న్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 15 కేసులు అతనిపై నమోదయ్యాయి. ఎంత చెప్పినా వినిపించుకోకుండా హుక్కా దందా కొనసాగిస్తుండగా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటీవల కాలంలో చుట్టూ తలుపులకు తాళాలు వేసి లోపల లైట్లు బంద్ చేసి చీకటి వ్యాపారం కొనసాగిస్తూ మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్నాడు. ఒకవైపు టాస్క్ఫోర్సు పోలీసులు ఇంకో వైపు జూబ్లీహిల్స్‌పోలీసులు పక్కా నిఘా వేసి దాడులు చేసేందుకు యత్నిస్తుంటే దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. తాజాగా బుధవారం సాయంత్రం పోలీసుల కళ్లుగప్పి మరోసారి మైనర్లకు హుక్కా సరఫరా చేస్తూ ఎట్టకేలకు చిక్కాడు. ఏడాది క్రితం నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారని తాము తీసుకొస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడని సాయంత్రంలోపు నిందితుడ్ని పట్టుకుని జైలుకు తరలించామని పోలీ సులు ఘటనను గుర్తుచేసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ హుక్కా సెంటర్ నిర్వాహకుడుగా పోలీసు రికార్డులకెక్కినా జీషన్ అహ్మద్ రోజువారీ సంపాదన అన్ని ఖర్చు లు పోనూ రూ.లక్ష ఉంటుందంటే హుక్కా వ్యాపారం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలనే రేంజ్‌రోవర్ కారు కొనుగోలు చేసిన జీషన్ పోలీసులకు దొరక్కుండా వారి కళ్లుగప్పి ప్రతిరోజు 40 మంది రెగ్యులర్ కస్టమర్లను పిలిపించుకుంటూ హుక్కా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మసక మసక చీకటిలో..
మసక మసక చీకటి, ఇంపుగా సంగీతం, హుక్కా పొగలు, మద్యం గ్లాసుల గలగలల మధ్య యువతుల నృత్యాలు. గతంలో ఉన్న లైవ్ బ్యాండ్ కుసంస్కృతి మళ్లీ జడలు విప్పుతోంది. అనేక రకాల అక్రమాలకు నెలవైన ఇలాంటి వినోద గృహాల వల్ల నాయకులు, ఖాకీలు తదితరులకు కాసు వర్షం కురుస్తోంటే అరికట్టేదెవరనే ప్రశ్న వినిపిస్తోంది. బెంగళూరు: నగరంలో మళ్లీ డ్యాన్స్ బార్లు ప్రత్యక్షమవుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బుల ముసుగులో జూదానికి ఆలవాలమైన స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నాయి. వీటిలో అనధికారిక డ్యాన్స్ బార్లను వెంటనే మూసి వేయించాల్సిందిగా నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ గత వారంలో అన్ని పోలీసు స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజకీయ పలుకుబడితో బార్ల యాజమాన్యాలు వీటిని నడిపిస్తున్నాయి. గతంలో గట్టి చర్యలు గత ప్రభుత్వంలో అప్పటి హోంమంత్రి రామలింగారెడ్డి ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా పోలీసు శాఖకు స్పష్టంచేశారు. ఫలితంగా డ్యాన్స్ బార్లు, స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లతో పాటు హుక్కా బార్లు, గంజాయి విక్రయాలను పోలీసులు సమర్థంగా అడ్డుకున్నారు. శాసనసభ ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వం కాస్త ఆపద్ధర్మంగా మారడంతో అక్రమార్కుల సాయంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎవరి పాత్ర ఎంతుంది? ఈ నేపథ్యంలో కేవలం అక్రమ డ్యాన్స్ బార్ల భరతం పట్టాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే సాకుతో ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులపై వేటు పడబోతోందని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ బార్ల వ్యవహారంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని, కనుక వారిపై కూడా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఎటువంటి స్కిల్ గేమ్‌లు లేదా డ్యాన్స్ బార్లను నిర్వహించే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. కనుక అలాంటి అధికారులపై కూడా చర్యలు చేపడితే, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు భవిష్యత్తులో కూడా ఆస్కారం ఉండబోదని వారు చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎలాంటి డ్యాన్స్ బార్లకైనా కమిషనరేట్ స్థాయి అధికారి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న అలాంటి బార్లకు ఆ స్థాయి అధికారుల ఆశీస్సులు తప్పక ఉంటాయనేది దిగువ స్థాయి సిబ్బంది వాదన. డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల వద్ద అలాంటి అక్రమ బార్ల సమాచారం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రస్తుతం నగరంలోని మెజిస్టిక్, ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, కోరమంగల, ఇందిరా నగర, వైట్ఫీల్డ్లలో అక్రమ డ్యాన్స్ బార్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలువురు లేడీస్ బార్ల పేరిట సుప్రీం కోర్టు ఆదేశాలను చూపిస్తూ, నగర పోలీసు కమిషనర్ నుంచి లైసెన్సులు పొందారు. గాంధీ బజారు, బ్యాంకు కాలనీ, కోరమంగల, ఇందిరా నగర, శేషాద్రిపురం సహా రిక్రియేషన్ క్లబ్ పేరిట నగరంలో 200కు పైగా కేంద్రాలు నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో మహిళలతో నృత్యాలు, హుక్కా వినియోగాలు వంటివి సాగుతుంటాయి. సంపన్న యువత, అధికాదాయ వ్యక్తులు వీటిలో జల్సాలు సాగిస్తుంటారు. వారిని అనుకరించలని మధ్యతరగతి మనుషులూ ప్రయత్నించి అప్పుల పాలవుతుంటారు. ఈ బార్ల చాటును జరిగే అక్రమాలూ అనేకమనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వీటిని అరికట్టేందుకు సరైన విధానమంటూ లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గురువారం వెకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బహుదూర్పురలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కిషన్‌బాగ్ దాల్మండిలో 300 మంది పోలీసులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితుల అరెస్ట్ చేశారు. సరైన ధృవపత్రాలులేని వాహనాలు సీజ్ చేశారు. మారణాయుధాలను స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై దాడులు చేశారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు పంజా విసిరారు. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు హుక్కా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హుక్కా సెంటర్ సీజ్
నాగోలు(హైదరాబాద్): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడిచేసి, సీజ్ చేసిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో పద్మావతి కాంప్లెక్స్ 3వ ఫ్లోరులో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం వీఆర్వో అనూష, పోలీసులు కలిసి హుక్కా నిర్వహిస్తున్న సెంటర్‌ను సీజ్ చేశారు. -
ఆ రెండు హుక్కా సెంటర్లపై దాడులు
హిమాయత్‌నగర్: పోలీసుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నారాయణగూడ ఠాణా పరిధిలో కొనసాగుతున్న రెండు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. సీఐ భీమ్‌రెడ్డి ఎస్సై నాగార్జునరెడ్డి కథనం ప్రకారం... నగరంలో హుక్కా సెంటర్లపై నిషేధం ఉంది. అయితే, స్టేషన్ పరిధిలో ఫిల్టర్ హుక్కా–స్నూకర్ పాయింట్, అక్స్ హుక్కాసెంటర్– స్నూకర్ పాయింట్ల పేరిట రెండు హుక్కా సెంటర్లను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ రెండు సెంటర్లపై దాడి చేశారు. అక్రమంగా నిర్వహించడమే కాకుండా మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రెండు సెంటర్లలో ఆ సమయమంలో హుక్కా సేవిస్తున్న 8 మంది బాలురను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, హుక్కా సెంటర్ల నిర్వాహకులు నోమాన్, పి.అభివన్లను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులనే ఏమార్చాలనుకున్నారు..
బంజారాహిల్స్: హుక్కా సెంటర్ల నిర్వాహకులు పోలీసులనే బురిడీ కొట్టించాలనుకుని దొరికిపోయారు. లైట్లు తీసేసి, గేట్లకు తాళాలు వేసి దర్జాగా అర్దరాత్రి దాటిన తర్వాత కూడా హుక్కా సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12 లోని టీజీఐటీ, అర్బన్‌గ్రిల్ హుక్కా సెంటర్లు అర్ధరాత్రి ఒంటి గంటకు మూసివేయాలి. ఎప్పటిలాగే మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ రెండు హుక్కా సెంటర్ల గేట్లను మూసివేసి తాళాలు వేసి లిఫ్ట్‌లు కూడా ఆపేశారు. అంతా బాగానే ఉంది. కానీ, లోపల మాత్రం వందలాది మంది యువతీ యువకులు హుక్కా పీలుస్తూనే ఉన్నారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి ఈ హుక్కా సెంటర్లలోకి వెళ్లడానికి ప్రయత్నించగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో వారు పక్కనే ఉన్న కాంప్లెక్స్ పైకి ఎక్కి అక్కడి నుంచి సదరు కాంప్లెక్స్‌లోకి దిగారు. వారు లోపలికి వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. అప్పటికీ సమయం అర్ధరాత్రి 2.30 గంటలు దాటింది. ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో టీజీఐటీ చెఫ్ రశీద్, రిజ్వాన్, అర్బన్ గ్రిల్ హుక్కా సెంటర్ మేనేజర్ విశాల్‌లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. -
హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: నగరంలోని పలు హుక్కాసెంటర్లపై శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 40 హుక్కాసెంటర్లను గుర్తించిన పోలీసులు వాటిపై కేసులు నమోదు చేశారు. వెస్ట్‌జోన్ పోలీసులు పాల్గొన్న ఈ దాడుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్న పలు హుక్కాసెంటర్లలో మైనర్ బాలురు దర్శనమివ్వడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
-
హుక్కాసెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: హుక్కాసెంటర్లపై దాడులు చేసిన పోలీసులు పలువురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని పలు హుక్కా కేంద్రాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా హుక్కా తయారీకి వినియోగించి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుర తల్లిదండ్రులను పిలింపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. -
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 60మంది అరెస్ట్
-
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 17మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పలు హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా గడిచిన రెండు నెలల కాలంలో హుక్కా సెంటర్లపై 40 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో అనుమతి లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించినట్టు తెలిపారు. పట్టబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
హుక్కా కేంద్రాలు.. రాత్రి 11 తర్వాత మూసేయాలి
హుక్కా కేంద్రాల నిర్వాహకులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హుక్కా కేంద్రాలు రాత్రి 11 గంటల తర్వాత తెరిచి ఉండకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. హుక్కాసెంటర్ల బయట అందరికీ కనిపించేలా సైన్‌బోర్డ్‌లు ప్రదర్శించాలని నిర్వాహకులకు స్పష్టంచేసింది. హుక్కా కేంద్రాల్లో మైనర్లను కాఫీ తాగేందుకు సైతం అనుమతించరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులిచ్చారు. తాము నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాల విషయంలో పోలీసులు అనవసర జోక్యంతో వేధింపులకు గురిచేస్తున్నారని, తమ కాఫీ షాప్‌లో హుక్కా సరఫరాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఫ్యూమర్స్ కాఫీ లాంజ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈ ఉత్తర్వులిచ్చారు. వీటిని రాష్ట్రం లోని అన్ని హుక్కాకేంద్రాల నిర్వాహకులు పాటించి తీరాలన్నారు. ఒకవేళ పిటిషనర్ వీడియో కెమెరాలతో షాపులో జరిగే కార్యకలాపాలు రికార్డ్ చేయదలచుకుంటే, వీడియోలను 15 రోజులు జాగ్రత్త చేయాలని, అవస రమైతే పోలీసులు వాటిని పరిశీలించేందుకు వీలివ్వాలని పేర్కొన్నారు.