
హుక్కా సెంటర్ సీజ్
నాగోలు(హైదరాబాద్):
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడిచేసి, సీజ్ చేసిన సంఘటన గురువారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్‌బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో పద్మావతి కాంప్లెక్స్ 3వ ఫ్లోరులో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం వీఆర్వో అనూష, పోలీసులు కలిసి హుక్కా నిర్వహిస్తున్న సెంటర్‌ను సీజ్ చేశారు.