స్నేహితులతో కలిసి ఉంటున్న ప్లాట్‌లో.. | Police Caught Youth Who Changed Room To Hukka Centre | Sakshi

స్నేహితులతో కలిసి ఉంటున్న ప్లాట్‌లో..

Mar 2 2022 8:54 PM | Updated on Mar 2 2022 8:58 PM

Police Caught Youth Who Changed Room To Hukka Centre - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): తమ ఫ్లాట్‌నే హుక్కా సెంటర్‌గా మార్చిన ముగ్గురు యువకులు నిబంధనలు ఉల్లంఘించి హుక్కా తాగుతుండగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఆ ఫ్లాట్‌పై దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేయడమే కాకుండా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కమలాపురి కాలనీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ సమీపంలో కమలాపురి కాలనీకి చెందిన వ్యాపారి వంశీపల్లె(34), ఎర్రగడ్డకు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌(27), యూసుఫ్‌గూడకు చెందిన పి.సిద్దు(27) కొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి హుక్కా తాగుతుండటమే కాకుండా తమ స్నేహితులను రప్పించి హుక్కా సరఫరా చేస్తున్నారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి ఇక్కడ దాడులు నిర్వహించగా ముగ్గురు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement