హైదరాబాద్: హుక్కాసెంటర్లపై దాడులు చేసిన పోలీసులు పలువురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని పలు హుక్కా కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా హుక్కా తయారీకి వినియోగించి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మైనర్ బాలుర తల్లిదండ్రులను పిలింపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.