నగరంలోని పలు హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
హైదరాబాద్: నగరంలోని పలు హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా గడిచిన రెండు నెలల కాలంలో హుక్కా సెంటర్లపై 40 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో అనుమతి లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు జరిపారు.
ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించినట్టు తెలిపారు. పట్టబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.