హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
Published Thu, Feb 23 2017 3:12 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
హైదరాబాద్: అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు పంజా విసిరారు. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు హుక్కా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement