
సాక్షి, హైదరాబాద్: వైన్స్ షాపులు నిత్యం రద్దీగా ఉంటాయి. వీటిలో మద్యానికి, కాసులకు కొదువ ఉండదు. అందుకే దొంగలు వినూత్నంగా ఆలోచించారు. ఇళ్లకు కాకుండా ఈసారి ఏకంగా మద్యం దుకాణానికి కన్నం వేశారు. అర్ధరాత్రి ఎవరూలేని వేళ మద్యం దుకాణానికి పైకప్పు నుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిపోయారు. వైన్స్ షాపులోని డబ్బుతోపాటు అందినకాడికి మద్యం బాటిళ్లు ఎత్తుకుపోయారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మంజు వైన్స్‌షాపులో ఈ చోరీ జరిగింది. మంజు వైన్స్‌కు పైనుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిన దొంగలు.. భారీగా నగదు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment