‘మిర్యాల’లో కార్డన్ సెర్చ్
Published Mon, Nov 28 2016 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సురభీ రాంగోపాల్‌రావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11మంది ఎస్‌ఐలు, 100మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా హోంగార్డులతో కాలనీలో ఇంటింటికీ తిరిగి సోదాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి ఆధారుకార్డును అడిగి వారు ఏ పని చేస్తున్నారు. ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారని వివరాలు సేకరించారు. కాలనీలో నాలుగు బృందాలుగా విడిపోరుున పోలీసులు ప్రధాన విధుల్లో ఎవరూ కాలనీ నుంచి బయటికి పోకుండా లోనికి రాకుండా బందోబస్తు నిర్వహించారు. కాలనీలోకి వచ్చే వారిని పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరమే అనుమతించారు. కాలనిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.
అనుమానిత వ్యక్తులు, పత్రాలు లేని ద్విచక్రవాహనాలను గుర్తిస్తే వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ సురభీ రాంగోపాల్‌రావు మాట్లాడుతూ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఇందిరమ్మకాలనీలో ముమ్మర తనిఖీలు చేపట్టామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే కాలనీ వాసులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకరావాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వున్న ఎలాంటి కార్యకలాపాలను సహించేదిలేదని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్, చిట్యాల, హాలియా సీఐలు దూసరి భిక్షపతి, పాండురంగారెడ్డి, పార్థసారథి, ఎస్‌ఐలు ప్రసాదరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కాలనీవాసుల కలవరం..
పోలీసులు ఒక్కసారిగా రాత్రి సమయంలో ఇందిరమ్మకాలనీలోకి రావడంతో స్థానికులు కలవరానికి గురయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లిన పోలీసులు కాలనీవాసులు వివరాంగా చెప్పి వివరాలు అడగడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement