హైదరాబాద్ : హైదరాబాద్లో అర్థరాత్రి పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 250మంది పోలీసులుతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 18మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
11వేల గుడుంబా ప్యాకెట్లు, 170 సిలెండర్లు, 17 గ్యాస్ రీఫిల్లింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్ కార్మికనగర్, రెహ్మత్ నగర్లోనూ సోదాలు జరిపారు. ఎనిమిదిమంది రౌడీషీటర్లు, 32మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2వేల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 24 వాహనాలను సీజ్ చేశారు.