భార్యాభర్తల మధ్య గొడవ.. 22 రోజుల పసికందు బలి | Saidabad Poosala Basti Wife And Husband Dispute Kills Newborn Baby | Sakshi
Sakshi News home page

Saidabad: భార్యాభర్తల మధ్య గొడవ.. 22 రోజుల పసికందు బలి

Published Sat, Sep 25 2021 1:22 PM | Last Updated on Sat, Sep 25 2021 1:45 PM

Saidabad Poosala Basti Wife And Husband Dispute Kills Newborn Baby - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో పసికందును బలిచేశారు భార్యాభర్తలు. దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. బాలింత అయిన భార్య, రోజుల శిశువుపై నిందితుడు రాజు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 22 రోజుల శిశువుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు పసికందు తల్లిదండ్రులైన రాజేష్‌ అలియాస్‌ రాజు,  జాహ్నవిలను అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి: సైదాబాద్‌ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి

రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం ఈ దంపతులు వారి తొలి సంతానం.. ఐదు నెలల బాబును మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని కాపాడి.. అతడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ చేర్చారు. రెండో సంతానం కూడా వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పసికందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement