
దేవరకొండలో కార్డన్ సెర్చ్
దేవరకొండ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని సంతోషిమాతా కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు కాటన్ల బీర్లు, రెండు కాటన్ల చీప్ లిక్కర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సీఐలు ఎంజీఎస్ రామకృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, ఎస్‌ఐలు రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, నాగభూషణ్‌రావు, సర్ధార్, క్రాంతికుమార్, సర్ధార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.