కరీంనగర్‌లోని కార్ఖానగడ్డలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు
కరీంనగర్: కరీంనగర్‌లోని కార్ఖానగడ్డలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 200మంది పోలీసులు ఒక్కసారిగా కార్ఖానగడ్డ నలుదిక్కుల దారులను మూసివేసి ఇంటింటా సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైక్‌లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు బీహార్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో అనుమానితులు నివాసం ఉంటున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని కమలాసన్‌రెడ్డి తెలిపారు.