హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున నగరంలో సంయుక్త కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 588 పోలీసులు.. మీర్ఆలం, ముస్తఫానగర్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, చందానగర్, శంషాబాద్, గుల్జర్నగర్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటు.. 26 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 120 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.