హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున నగరంలో సంయుక్త కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 588 పోలీసులు.. మీర్ఆలం, ముస్తఫానగర్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, చందానగర్, శంషాబాద్, గుల్జర్నగర్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటు.. 26 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 120 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
తనిఖీల సందర్భంగా గుర్తించిన 12 మంది బాలకార్మికలకు పోలీసులు విముక్తి కల్పించారు. నగరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లతో నేరగాళ్లకు వణుకుపుట్టిస్తున్నారు.
కార్డన్ సెర్చ్, అదుపులో 101 మంది అనుమానితులు
Published Wed, Jul 13 2016 9:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement