సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్‌ | Mahesh Babu Reacts On Saidabad Singareni Colony Incident | Sakshi
Sakshi News home page

Mahesh Babu: సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్‌

Sep 14 2021 9:00 PM | Updated on Sep 14 2021 9:28 PM

Mahesh Babu Reacts On Saidabad Singareni Colony Incident - Sakshi

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేశ్‌ బాబు స్పందించారు. 'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ  ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి  దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం' అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.

మరోవైపు హీరో మంచు మనోజ్‌ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన మనోజ్‌.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. కాగా సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

చదవండి : సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement