
వ్యభిచార గృహంపై దాడి: 9మంది అరెస్ట్
సైదాబాద్: నగరంలోని ఓ వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ కె.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం టూఆర్టీ క్వార్టర్స్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు నిర్వహించిన దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.