సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.
హైదరాబాద్ : సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి తలుపు గొళ్లెం తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో దాచిన 4 తులాల బంగారం, రూ.45 వేల నగదు, ఒక కెమెరా దొంగిలించారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు.