
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సైదాబాద్: ఆరాంఘర్‌లో నివసించే మేస్త్రీ రాజు, రాజేశ్వరి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రాజేశ్వరి నిండు గర్భిణి. రాజుతో గొడవ పడిన ఆమె మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం శంకేశ్వరబజార్ నుంచి సైదాబాద్ వైపు వెళ్తుండగా రాజేశ్వరికి పురిటి నొప్పులు వచ్చాయి. రహదారి పక్కన ఆమె బాధపడుతూ కూర్చుండి పోయింది. అప్పుడు అక్కడే ఉన్న శంకేశ్వరబజార్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లిమెల్లి మోజెస్ తదితర కాలనీవాసులు 108కు సమాచారం ఇచ్చారు.
అలాగే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి విషయం తెలిపి సహకరించాల్సిందిగా కోరారు. 108 వచ్చేలోపే పునే రాజేశ్వరి రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పుట్టిన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లి సపర్యాలు చేశారు. 108 సిబ్బంది రాజేశ్వరికి 108లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తల్లీబిడ్డలను 108లో కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment