
నల్గొండ(భువనగిరి): సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు.
ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారని, దీనిని ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని మనోజ్ కోరాడు. ఛత్తీస్‌గడ్‌లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని తెలిపాడు. అలాగే సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటామని మంచు మనోజ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment